రజినీకాంత్ పేట మూవీ రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టా్ర రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పేట’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. వరుసబెట్టి సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న రజినీ.. ఈ సినిమాతో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు తలైవా ఫ్యాన్స్. కాగా ఈ సినిమా కోసం యావత్ సౌంత్ ఇండియా ఆసక్తిగా చూస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన పేట మూవీ మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
హాస్టల్ వార్డెన్‌గా పని చేసే కాలి(రజినీ) అక్కడి కాలేజీలో స్టూడెంట్స్‌ను చాలా క్రమశిక్షణలో పెడుతుంటాడు. జూనియర్‌ స్టూడెంట్‌గా మేఘా ఆకాష్ ఎంట్రీ ఇవ్వడంతో సీనియర్ అయిన బాబీ సింహా ఆమెను లవ్‌లో పడేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రానిక్ హీలర్‌గా సిమ్రాన్ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు రజినీ. కట్ చేస్తే.. ఉత్తరప్రదేశ్‌లో ప్రేమికులకు ఫిబ్రవరి 14న పెళ్లి చేస్తుంటాడు విజయ్ సేతుపతి. అయితే బాబీ సింహా లవ్ రిజెక్ట్ కావడంతో రజినీపై అటాక్ చేయాలని చూస్తాడు. మరి రజినీ ఈ అటాక్‌ నుంచి ఎలా తప్పించుకుంటాడు? ఇంతకీ విజయ్ సేతుపతికి కాలికి రిలేషన్ ఏమిటి? అసలు కాలి ఎవరు.. అతడి ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? అనేది సినిమా స్టోరీ.

విశ్లేషణ:
రజినీ స్టైల్‌కు పేట సినిమా పర్ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పాలి. కాలి పాత్రలో చాలా స్టైలిష్‌గా నటించాడు తలైవా. తన మార్క్ డైలాగులతో, యాక్షన్ సీక్వెన్స్‌లలో రజినీ చేసే హంగామా మూమూలుగా ఉండదు. ఈ సినిమా స్టోరీ పాతదే అయినప్పటికీ.. నేటి ట్రెండ్‌ కోసం కొంచెం మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఫస్టాఫ్ మొత్తం రజినీని ఎలివేట్ చేసే సీన్స్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కానీ కామన్ ఆడియెన్‌కు అది కాస్త నచ్చకపోవచ్చు. అటు సిమ్రాన్‌తో రజినీ కెమిస్ట్రీ చూడటానికి బాగుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్ సూపర్.

ఇక సెకండాఫ్‌ మొత్తం భాషా సినిమా తరహాలోనే ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లో నడుస్తుంది. అందులో కేవలం రివెంజ్‌ డ్రామాకే దర్శకుడు ప్రాముఖ్యత ఇవ్వడంతో సినిమా స్టోరీలైన్ ఆసక్తిని కోల్పోతుంది. కానీ రజినీ మార్క్ డైలాగులు పుష్కలంగా ఉండటంతో ఫ్యాన్స్‌ విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేస్తారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగుండటంతో సినిమా ముగుస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే ‘పేట’ చిత్రం అటు తలైవా ఫ్యాన్స్‌కు అల్ట్రా స్టైలిష్‌ మూవీగా కనిపిస్తే.. ఇటు కామన్ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. మొత్తంగా రజినీ మార్క్ స్టైల్, యాక్షన్, డైలాగులు ఇష్టపడే వారు మాత్రం పేట చిత్రన్ని ఖచ్చితంగా చూడాల్సిందే.

నటీనటులు పర్ఫార్మెన్స్:
కాలి, పెట్ట వీరగా రజినీ పర్ఫార్మెన్స్ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా.. రజినీ ముందు వారెవ్వరూ కనిపించలేదు. తనదైన స్టైల్‌తో రజినీ సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో లాక్కొచ్చాడు. అటు విజయ్ సేతుపతి కూడా తనదైన మార్క్ వదులుతాడు. నవాజుద్దీన్ సిద్దీఖి, శశికుమార్, సిమ్రాన్, త్రిష తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
రజినీని మరింత స్టైల్‌గా చూపించాలనే ఉద్దేశ్యంతో పాత కధను ఎంచుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సినిమా స్టోరీని నెరేట్ చేసిన విధానం సాధారణ ప్రేక్షకుడికి అంతగా నచ్చదు. ఏదో రజినీ ఉన్నాడు కాబట్టి ఎలాంటి కథనైనా చూస్తారనే కాన్ఫిడెన్స్‌తో దర్శకుడు చేసిన అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది. కొన్ని సీన్స్‌లో సినిమా చాలా బోరింగ్‌గా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా కలిసొచ్చింది. అనిరుధ్ అందించిన మ్యూజిక్ సూపర్. ముఖ్యంగా యాక్షన్ సీక్వె్న్స్‌లలో వచ్చే బీజీఎం మైండ్‌ బ్లోయింగ్.

చివరగా:
పేట – రజినీ ఫ్యాన్స్‌కు ఫుల్.. మిగతావారికి నిల్!

రేటింగ్: 2.5/5

Share.