రజనీ రొయ్య మీసాలు ”పెట్టా”డు

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా పెద్ద ప్రయోగానికే రెడీ అయిపోతున్నాడు. సినిమా సినిమాకి చాలా వైవిధ్యమైన పాత్రలు ఎంపిక చేసుకుని డిఫ్రెంట్ లుక్ తో ప్రేక్షకులను మైమరిపించే ఆయన తన కొత్త సినిమా ‘పెట్టా’ లో కూడా అదే వైవిధ్యమైన పాత్రను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఆయన నటించిన చిత్రాల్లో పాత్రలు పరిశీలిస్తే.. ఆయన వయసుకి గెటప్ కి అస్సలు సంబంధమే కనిపించదు. రోబో పాత్రలో నిజమైన రోబోని తలపిం చేలా ఆయన క్యేరెక్టయిర్ లో లీనం అయిపోయాడు. ఇక 165వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఆయన రొయ్య మీసం హైలైట్ గా కనిపిస్తుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు.

నుదిటిన తంబీ మార్క్ నామంబొట్టు.. ఆపై కుంకుమ బొట్టు.. సిల్కు బ్రాండు తెల్లచొక్కాయ్ అబ్బబ్బో రజనీ కొత్తగా మారిపోయారే అనిపించకమానదు. ముఖ్యంగా తనదైన మార్క్ ని గుర్తు చేసేలా ముందుకు దువ్విన ఆ ఫంకు తో ఇరగదీసేసాడు. కబాలి’, ‘కాలా’ వంటి డిజాస్టర్స్ తర్వాత రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెట్టా’. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఒకప్పుడు చంద్రముఖి స్టైల్లో హర్రర్ కాన్సెప్ట్ తో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో భారీ హిట్టు కొట్టాలని రజనీ చూస్తున్నాడు. ఎందుకంటే అసలే పొలిటికల్ గా ఎంట్రీ ఇద్దామని చూస్తున్న ఈ తరుణంలో ఈ సినిమా కనుక హిట్ ఇస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా .

Share.