సూపర్ స్టార్ రజినీకాంత్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో నటించి కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈరోజు ఆయన 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఇక ఈ సందర్భంగా ఈయన ఆస్తి విలువ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం.
రజనీకాంత్ ఏ సినిమాలోనైనా నటిస్తాను అని చెబితే ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడడం లేదు. అంత స్టార్ ఇమేజ్ ను ఈయన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాల వైపు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇకపోతే ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 380 కోట్ల రూపాయలని సమాచారం. ఇక పోతే సినిమాల ద్వారా సంపాదించిన మొత్తంలో కొంత డబ్బును రజనీకాంత్ సేవా కార్యక్రమాల కోసం కూడా ఖర్చు చేస్తూ వస్తున్నారు. ప్రముఖ టాప్ కంపెనీల లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 25 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని సమాచారం.