దర్బార్‌లో మీటింగ్ పెడుతున్న సూపర్ స్టార్

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సినిమా చేయాలంటే కనీసం రెండేళ్లు పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. బాక్సాఫీస్ దగ్గర పోటీ తీవ్రంగా ఉంటుండటంతో ఎలాంటి హీరో అయినా ఏడాదిలో రెండు సినిమాలు చేస్తూ తమ మార్కెట్‌ను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీ కూడా ఇదే స్ట్రాటజీలో దూసుకుపోతున్నారు. ఇటీవలె 2.0 చిత్రంతో వచ్చిన రజినీ.. తన నెక్ట్స్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రిలీజ్ చేశారు.

తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే తలైవా తన ఫ్యాన్స్‌కు ఊహించని విధంగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. మురుగ-రజినీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ‘దర్బార్’ అనే టైటిల్ అనౌన్స్ చేయడమే కాకుండా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌తో కోలీవుడ్ వర్గాలు ఫుట్ హ్యాపీగా ఉన్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీ ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తలైవా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో లేడా సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Share.