దర్బార్ కోసం రజిని షాకింగ్ రెమ్యునరేషన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ లో సూపర్ స్టార్ రజినికాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రజిని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సినిమాలు చేసే కలక్షన్స్ రేంజ్ ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈమధ్య కాలంలో రజిని మార్క్ హిట్ అందుకోవడంలో వెనుకపడగా ఈసారి దర్బార్ తో పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడు రజినికాంత్. ఏ.ఆర్ మురుగదాస్ డైరక్షన్ లో రజిని హీరోగా వస్తున్న సినిమా దర్బార్.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెర్కెక్కింది. ఇక ఈ సినిమాకు రజిని రెమ్యునరేషన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా రజిని 100 కోట్లు వసూళు చేసినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ స్టామినా చూపించేలా దర్బార్ సినిమా రెమ్యునరేషన్ చార్జ్ చేసాడు రజిని.

ఈ సినిమాలో రజిని సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. జనవరి 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. రెమ్యునరేషన్ 100 కోట్లు తీసుకున్న సౌత్ హీరోగా సూపర్ స్టార్ రజినికాంత్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. దర్బార్ హిట్ అయితే ఇక రజిని మరో మూడు నాలుగేళ్లు హవా కొనసాగించే అవకాశం ఉంది.

Share.