రాజావారు రాణిగారు టీజర్ భలేగుందే…!

Google+ Pinterest LinkedIn Tumblr +

గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది… అదేమంటే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదంటూ దర్శకుడు హరీష్ శంకర్ రాసాడు. అయితే ఈసినిమా డైలాగ్ను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో తెలియదు గాని అంతా కొత్తవారితో ఓ సినిమాను తీసారు. ఆ సినిమా టీజర్ను చడిచప్పుడు లేకుండా విడుదల చేసింది చిత్రయూనిట్. ఇంతకు ఈ సినిమా ఏంటంటే రాజావారు రాణిగారు…

కిరణ్ అబ్బవరం అనే కుర్రాన్ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్ రహస్య గోరక్. కొత్త దర్శకుడు రవికిరణ్ కోల. మనో వికాస్ అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించాడు. దర్శకుడు రవికిరణ్ కొల ఈ చిత్రానికి రచయితగా కూడా కథను అందించాడు. అంతా కొత్తవారే… అయినా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారనిపిస్తుంది టీజర్ను చూస్తే. ఇటీవల వచ్చిన బుర్రకథ సినిమాలాగానే భలే ఫన్నీగా టీజర్ను తీర్చిదిద్దారు. పాత్రల గురించి వివరించిన తీరు, టీజర్ కట్చేసిన తీరు, మంచి ఫ్లో ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుని మరి కట్ చేశారు.

ఓ పల్లేటూరి వాతావరణంలో తీసిన విజువల్స్ టీజర్ను మరింత అందం తెచ్చింది. ఈ చిత్ర యూనిట్ టీజర్లో ఓ విన్నపం ఇప్పుడు అందరి దృష్టిని అలరిస్తుంది. కథలోని మరిన్ని పాత్రలు, మలుపులు, మెలికలు, రంగరించి, సింగారించి ఒక సుదినమున ట్రైలర్ రూపాన మీ ముందుకు తీసుకొస్తామని మనవి చేసుకుంటున్నాం.. .అంటూ కొసమెరుపు ఇచ్చారు. ఈ సినిమా పెద్దలతో కూడినది కాకున్నా మరో ఐతే, ఈ రోజుల్లో, పెళ్ళి చూపులు, అర్జున్రెడ్డి, ఆర్ ఎక్స్100, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాల సరసన చేరడం ఖాయమనిపిస్తుంది ఈ చిన్న చిత్రం.

Share.