రాజశేఖర్ మూవీ శేఖర్.. ఓటిటిలో భారీ ఆఫర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొద్ది రోజుల క్రితం ఎక్కువగా సినిమాలన్నీ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే తాజాగా కరోనా పరిస్థితి తగ్గుముఖం పట్టడంతో.. సినిమాలన్నీ థియేటర్ల వైపు రిలీజ్ అవ్వడానికి సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు చిన్న సినిమాలు సైతం.. థియేటర్లలో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు విడుదల చేయడానికి సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలోనే ఒక సినిమా పై దాదాపు అన్ని ఓటీటీలు కన్నేశాయి.ఆ సినిమా ఏదో కాదు శేఖర్..

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను డైరెక్ట రిలీజ్ కింద తీసుకోవడానికి కొన్ని ఓటీటీ లు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్సీ రేట్లు కూడా బాగా ఆఫర్ చేస్తున్నాయి..అంతే కాదు 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా రీమేక్ మూవీ అయినప్పటికీ కథ-స్క్రీన్ప్లే లో మార్పులు చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలో ఓ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారట.. సినిమా చూసి మాత్రమే ఆ సర్ ప్రైజ్ ఎంతో తెలుసుకోవాలి అని అంటున్నారు. ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ డైరెక్టర్ కాగా స్క్రీన్ప్లే విభాగం కూడా ఆమెని చూసుకుంటున్నారు.

Share.