Rajashekar..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో రాజశేఖర్ (Rajashekhar )కూడా ఒకరు. ఈయన యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడ . ఒకప్పుడు స్టార్ హీరోలతో పోటీపడి నటించిన వ్యక్తి ఈ మధ్యకాలంలో రాజశేఖర్ స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పుడు చేసిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాకపోవటంతో సరైన ప్రాజెక్టులు రాకపోవటంతో రాజశేఖర్ కెరీర్ ఒక రకంగా ఒడిదుడుకులతో సాగుతుందని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ఆయనకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రాజశేఖర్ కి శ్రీదేవికి ఫ్యామిలీ నుంచి వచ్చిన పెళ్లి ప్రపోజల్ వార్త. ఈ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ఇంటర్వ్యూలో పాల్గొన్నా రాజశేఖర్, జీవిత ఇందులో వీరి ప్రేమ గురించి చెబుతూ శ్రీదేవి ప్రపోజల్ వచ్చిన సంగతి బయటపెట్టారు. తాను డాక్టర్ గా ఉన్నప్పుడు చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడిని ఆ టైంలో శ్రీదేవి సినిమాలు చేస్తోంది. అయితే శ్రీదేవి ఫాదర్ రాజశేఖర్ ఫాదర్ ఇద్దరు మంచి స్నేహితులు అందుకని ఆ చనువుతో శ్రీదేవిని రాజశేఖర్ ఇచ్చి పెళ్లి చేద్దామా అని అడిగితే రాజశేఖర్ ఫాదర్ మావాడు ఎం ఎస్ చేయాలని చెప్పారట.
కానీ శ్రీదేవిని వద్దనడానికి కారణం అది కాదట. రాజశేఖర్ పేరెంట్స్ కి సినిమా వాళ్లు అంటే ఇష్టం లేదట. అంతెందుకు రాజశేఖర్ సినిమాల్లోకి వస్తానన్న వాళ్లు ఒప్పుకోలేదట. ఒకవేళ నువ్వు వెళ్లాలనుకుంటే మా కండిషన్లని ఒప్పుకొని వెళ్ళాలి అని చెప్పారట. ఇండస్ట్రీలో ప్రేమ దోమ అని తిరిగితే ఒప్పుకోనని చెప్పి మరి పంపారట. అప్పటికే శ్రీదేవి సినిమాల్లో ఉంది. కాబట్టి ఆమెని రిజెక్ట్ చేశారట. జీవితా కూడా ఒక హీరోయిని కానీ జీవితాన్ని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె సినిమాల్లో నటించడమే మానేసింది.