టాలీవుడ్లో అగ్ర డైరెక్టర్ గా పేరుపొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా తన పేరును RRR సినిమాతో పాపులర్ అయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగు కూడా అవార్డు దక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అవార్డు వచ్చిన నేపథ్యంలో రాజమౌళిని ఇండియన్ ప్రముఖుల సైతం అభినందనలతో మంచిస్తున్నారు ఇప్పటికే చిరంజీవి ,అమితాబచ్చన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ అంటే అగ్ర హీరోలు సైతం అభినందనలు తెలిపారు.
ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సైతం రాజమౌళిని ప్రశంసిస్తూ నెట్టింట ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ RRR టీంకు అభినందనలు గోల్డెన్ గ్లో పురస్కారం దక్కించుకున్న మొట్టమొదటి ఆసియా సినిమా ఇదే భారతీయ సినిమా అద్భుత విజయం అంటూ ఈమె పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో ప్రియాంక చోప్రా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల పాటు రాణిస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడు ప్రియాంక చోప్రా ఇండియాలోనే కాదు గ్లోబుల్ వైర్ గా మంచి పాపులారిటీ అందుకుంది.
హాలీవుడ్ లో కూడా పలు సినిమాలో నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రియాంక చోప్రా.. రాజమౌళికి మరింత గుర్తింపు దక్కించుకునేలా ట్వీట్ చేయడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజమౌళి గారికి మరింత గుర్తింపు రావాలి అంటే హాలీవుడ్ లో సైతం మన తెలుగు తేజం విస్తరించాలి అన్న ప్రియాంక చోప్రా మాటలకు.. రాజమౌళి ,ప్రియాంక చోప్రా కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. మరి ఈమెతో రాజమౌళి సినిమా చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది