బాలకృష్ణ హీరో గా .. రాజమౌళి దర్శకుడిగా.. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక బాలయ్య నటించిన ఎన్నో సినిమాలకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా పనిచేశారు. అయితే తాజాగా బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా హాజరైన రాజమౌళి కొన్ని విషయాలను తెలిపాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. బాలయ్య ఆటంబాంబు లాంటివాడు.. పెద్ద హిట్ కావడంతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో భరోసా తీసుకొచ్చాడు అని తెలిపాడు రాజమౌళి.
నేను కోరుకున్నట్టుగానే బాలయ్య అఖండ సినిమా సంచలనం సృష్టించింది..ఈ మధ్యకాలంలో ఏ సినిమా సాధించని స్థాయిలో అఖండ మూవీ కలెక్షన్లను సాధించడం చాలా ఆనందంగా ఉంది. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలా..? వద్దా..? అని నిర్మాతలు టెన్షన్ పడుతున్న సమయంలో అఖండ ఇండస్ట్రీ వర్గాల లో భరోసా ఇవ్వడం గమనార్హం. ఏది ఏమైనా ఈ సినిమా విడుదల చేసి బాలయ్యబాబు నా కోరిక తీర్చాడు అంటూ రాజమౌళి తెలిపాడు.