బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో రాబోతున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రాం చరణ్ కు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు.
బాలీవుడ్ భామలతో చర్చలు జరుపుతుండగా పరిణితి చోప్రా, అలియా భట్ లను అడగ్గా.. వారిద్దరు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. పరిణితి చోప్రా 4 కోట్లు, అలియా భట్ 6 కోట్లు డిమాండ్ చేశారట. ఈ రెమ్యునరేషన్ విన్న రాజమౌళికి షాక్ తిన్నట్టైంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్స్ అయితే బెటర్ అన్న ఆలోచనతో వారిని అడిగారట. కాని వారు మాత్రం రెమ్యునరేషన్ తో షాక్ ఇచ్చారు. మరి అంత ఇచ్చి వాళ్లను ఓకే చేస్తారా లేక మన దగ్గర ఉన్న వారితో కానిచ్చేస్తారా అన్నది చూడాలి.