తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ నేపథ్యమున్న కుటుంబంలో జన్మించటం వల్ల చిన్నప్పటి నుంచే సంగీతంపై ఎక్కువ మక్కువ ఉండటంతో మొదట్లో సింగర్ గా తన కెరీర్లు ప్రారంభించింది M.M. శ్రీలేఖ ఇక ఆ తర్వాత కంపోజర్ గా ప్లే బ్యాక్ సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కీరవాణికి సొంత సోదరి అన్న విషయం మనకు తెలిసిందే .ఇటు కీరవాణి కుటుంబానికి అటు రాజమౌళి కుటుంబానికి వీరిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధంతో M .M.శ్రీలేఖ కూడా రాజమౌళిని అన్నయ్య గానే భావిస్తారు. ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే..
ఇండస్ట్రీలోకి రాజమౌళి సహకారంతోనే శ్రీలేఖ కి అవకాశాలు వస్తున్నాయని అందుకే ఆమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె దాదాపు 80 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశారు. రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినప్పటికీ శ్రీలేఖకి మాత్రం ఒక్క సినిమా అవకాశం కూడా కల్పించలేదు. దీంతో వీరిద్దరి మధ్య చిన్న పార్టీ మనస్పర్ధలు వచ్చాయని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీ లేక ఈ విషయం గురించి మాట్లాడారు. రాజమౌళికి కీరవాణి అన్నయ్య పై చాలా నమ్మకం అలాగే అభిమానం తన సినిమాకి తనని మాత్రమే ఎంపిక చేసుకుంటారు. అలాగే రాజమౌళికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు భవిష్యత్తులో నాకు కూడా తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తారేమో చెప్పలేం అని సమాధానం ఇచ్చింది శ్రీలేఖ అయితే రాజమౌళి అన్నయ్యతో కానీ తన కుటుంబంతో కానీ నాకు ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీగా మాట్లాడింది శ్రీలేఖ