Rajamouli..టాలీవుడ్ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకులలో రాజమౌళి (Rajamouli )కూడా ఒకరు. ఆయన తీస్తున్న సినిమాలన్నీ ఎలాంటి చరిత్రను సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తీసే ఒక్కో సినిమా సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తూ ఉంటుంది. తన సినిమా రికార్డులను బ్రేక్ చేయాలి అంటే కేవలం మళ్ళీ అతనితోనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అంతలా తన పేరును బాగా పాపులర్ చేసుకున్నారు. రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ డైరెక్టర్ గా కూడా పేరుపొందారు.
హాలీవుడ్ టెక్నీషియన్సీ సైతం నటీనటులు సైతం రాజమౌళితో సినిమాలు చేయడానికి చాలా ఆత్రుతగా ఉన్నారు. అలాంటి రాజమౌళికి నటన మీద, ఒక కథ మీద ఉన్నంత పట్టు ఇంకెవరికి ఉండదని చెప్పవచ్చు.. ఒక సన్నివేశంలో ఎలాంటి డైలాగులు ఉండాలి ఎలా నటించాలి అనేది మాత్రం రాజమౌళికి మాత్రమే తెలుసు అలాంటి రాజమౌళికి కూడా ఒక ఫేవరెట్ హీరో ఉన్నారని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
రాజమౌళి మెచ్చుకున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు రాజమౌళి స్వయంగా తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించినట్టు ఇండియాలో ఎవరు కూడా నటించలేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు రాజమౌళి.. సింగిల్ టేక్ ఆర్టిస్టుగా జూనియర్ ఎన్టీఆర్ మంచి క్రేజీ ఉందని రాజమౌళి స్వయంగా తెలియజేశారు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఎన్టీఆర్ ఒదిగిపోయే గుణం కలదు అని తెలిపారు రాజమౌళి.
అందుకే కేవలం తనకు ఎన్టీఆర్ మాత్రమే నటన పరంగా ఇష్టమని ఎన్నోసార్లు తెలియజేశారు రాజమౌళి. ఇక రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్టీఆర్ మాత్రం డైరెక్టర్ కొరటాల శివతో తన 30 వ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.