డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న క్రేజీ మూవీ కె.జి.ఎఫ్. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ఈ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. కోలార్ గోల్డ్ మైన్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ముందుగా తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. కె.జి.ఎఫ్ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో రాజమౌళి కన్నడ నటుడు యశ్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని తను ఈరోజు స్టార్ అవడం గొప్ప విషయమని అన్నారు. నాలుగైదేళ్ల క్రితం కన్నడలో యశ్ గురించి తెలిసిందని. ఏప్రిల్ లో బెంగళూరులో కె.జి.ఎఫ్ టీం ను కలిస్తే వాళ్లు మేకింగ్ విజువల్స్ చూపించారని. ఒరిజినల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు. ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకు యశ్ అని తెలిసింది. తానో స్టార్ అయినా అతని తండ్రి ఇప్పటికి బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని. నిజమైన సూపర్ స్టార్ అతనే అని అన్నారు రాజమౌళి.
ఇక తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమా వచ్చినా సరే అది నచ్చితే దాన్ని సూపర్ హిట్ చేస్తారని. తన ప్రేక్షకుల మీద తన నమ్మకాన్ని వెళ్లబుచ్చారు రాజమౌళి. కె.జి.ఎఫ్ ఈవెంట్ లో తన స్పీచ్ వింటే ఈ సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ చేయమన్న ఐడియా తను ఇచ్చినట్టే అని తెలుస్తుంది. మొత్తానికి బాహుబలి, 2.ఓ తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎలా ఉండబోతుందో చూడాలి.