టాలీవుడ్ స్థాయిని వేరే లెవెల్లోకి తీసుకుని వెళ్లిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాహుబలి అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎంతో అద్భుతంగా బాహుబలి రెండు పార్టులను కూడా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి ఒక అద్భుతం అయితే ట్రిపుల్ ఆర్ మరొక సెన్సషన్ అనే చెప్పాలి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని జక్కన్న అనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టేసారు. ప్రమోషన్స్ లో భాగంగా తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అని క్లారిటీ అయితే ఇచ్చాడు.
అలాగే బాహబులి 3 సినిమా గురించి కూడా ఒక ఆసక్తికర విషయం చెప్పాడు.కచ్చితంగా బాహుబలి మూడవ భాగం ఉంటుందనే నమ్మకంను రాజమౌళి వ్యక్తపరిచారు.అంటే భవిష్యత్తులో మళ్ళీ మనం మాహిష్మతి రాజ్యాన్ని తెర మీద చూసే అవకాశం ఉందన్నమాట.