Raj Tarun..టాలీవుడ్ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలలో రాజ్ తరుణ్ (Raj Tarun)కూడా ఒకరు. మొదట ఉయ్యాల జంపాల సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తన నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో వెబ్ సిరీస్ ల వైపు కూడా అడుగు వేశారు.ఇవి కూడా సక్సెస్ కాలేకపోయాయి దీంతో చాలానే అవకాశాలు తగ్గిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో పలు సినిమాలకు కథలు కూడా రాసేవారు. అయితే హీరో కావడం చేత రాజు తరుణ్ కు కథలు రాయడం ఇష్టం లేదట. కేవలం దర్శకుడుగా నిర్మాతగా కావాలని ఎన్నో కలలు కన్నె వారట. కానీ డైరెక్టర్ రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో ఆవికా గోర్ తో కలిసి నటించడం జరిగింది. రాజు తరం 52 షార్ట్ ఫిలిం లను కూడా నటించారు. ఉయ్యాల జంపాల చిత్రానికి ఇంటర్నేషనల్ మూవీ అవార్డుగా ఉత్తమ నటుడుగా గెలుచుకున్నారు.
అయితే గతంలో యాంకర్ లాస్యతో, రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ పలు రూమర్లు కూడా వినిపించాయి.. ఈ విషయంపై రాజ్ తరుణ్ ఒక సందర్భంలో స్పందిస్తూ..తన ఫేస్బుక్లో తన ఫోకస్ మొత్తం కెరియర్ పైనే ఉందంటూ తెలిపారు.. అలా రాజ్ తరుణ్, లాస్య గతంలో ఒక ఈవెంట్లో మాత్రమే కలిశారు.
దీంతో ఆ తర్వాత వీరిద్దరూ టచ్ లో లేరని కూడా తెలియజేయడం జరిగింది. కానీ మీడియా మాత్రం వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పలు రకాలుగా వార్తలను రాస్తూ ఉంటారని అభిమానులు ఫైర్ అవుతున్నారు. లాస్య కూడా వివాహం చేసుకొని ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.