ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీరు తమ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నప్పటికీ, అభిమానులకు ఏ మాత్రం చెప్పకుండా వివాహం చేసుకోవడంతో వారి అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆ సెలబ్రిటీలు పోస్ట్ చేసిన ఫోటోలను చూసి ఒక పక్క ఆనందం వ్యక్తం చేయడంతో పాటు మరోపక్క ఎందుకు ముందే చెప్పలేదు అంటూ కూడా కొంతమంది అనుమానాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇక గొడవ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రద్ద ఆర్య, తాజాగా రహస్యంగా వివాహం చేసుకొని , సోషల్ మీడియా ద్వారా తన వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.ఇక ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక 34 సంవత్సరాల వయసులో ఈమె తాజాగా వివాహం చేసుకుంది. ప్రముఖ నేవల్ అధికారి అయిన రాహుల్ నాగల్ ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది.గొడవ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన శ్రద్ధ ,ఆ తర్వాత రోమియో, కోతిమూక అంటూ కొన్ని యూత్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ సరైన బ్రేక్ లేక బాలీవుడ్ సీరియల్స్ చేసుకుంటూ అక్కడ గుర్తింపు పొందుతోంది.కసమ్ తేరే ప్యార్ కే, కుండలి భాగ్య వంటి బాలీవుడ్ బుల్లితెర సీరియల్స్ తో మంచి అభిమానులను సొంతం చేసుకుంది.
రహస్యంగా వివాహం చేసుకున్న ప్రముఖ హీరోయిన్..!
Share.