దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణించి అప్పుడే 30 రోజులు అయింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తాజాగా కంఠీరవ స్టూడియో లో పునీత్ సమాధికి పూజలు చేశారు. అక్కడికి పునీత్ అన్న శివ రాజ్ కుమార్, భార్య గీత, అన్న రాఘవేంద్ర, పునీత్ భార్య అశ్విని పలువురు పాల్గొన్నారు. అయితే పూజ అనంతరం పునీత్ అన్న రాఘవేంద్ర మాట్లాడుతూ.. పునీత్ కు కార్లు, కోట డబ్బులు ఉన్నప్పటికీ 5 నిమిషాల సమయం దొరకలేదని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.
పునీత్ ఇంత త్వరగా ఎందుకు మరణించారు అనేది ప్రతి ఒక్క అభిమానికి ప్రశ్నగా మారింది అని ఆయన అన్నారు. ఇప్పటికీ పునీత్ కుటుంబ సభ్యులు, అభిమానులు పునీత్ మరణించారు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ అతని జ్ఞాపకాలు కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అన్ని నాయండహల్లి జంక్షన్ నుంచి బన్నేరఘట్ట రోడ్డు మెగాసిటీ మాల్ జంక్షన్ వరకు పునీత్ రాజ్ కుమార్ పేరుపెట్టాలని బీబీఎంపీ నిర్ణయించింది. 12 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుకు పునీత్ రాజ్ కుమార్ పేరును ఖాయం చేయనున్నారు.