రెబల్ స్టార్ ప్రభాస్ ,పూజ హెగ్డే కలిసి నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకి డైరెక్టర్ గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ బాగా వైరల్ గా మారాయి.
అయితే తాజాగా నిన్నటి రోజున “వన్ హార్ట్ టు హార్ట్ బీట్స్”అనే పేరుతో రాధేశ్యామ్ ను హిందీ లో డబ్బింగ్ చేశారు. ఆషీకీ ఆ గయీ అనే పాట సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది . ఈ క్రమంలోనే తాజాగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో “నగుమోము తారలే” అనే పాటను రిలీజ్ చేశారు.. ఇక ఈ పాట మొదట్లో.. నువ్వు రోమియో వా అని పూజ హెగ్డే, ప్రభాస్ ని అడగగా.. ప్రభాస్ నేను రోమియో కాదు అని చెపుతాడు.. అప్పుడు పూజ ..నేను జూలియట్ …నాతో ప్రేమలో పడితే చస్తావ్ అని పూజ అనడంతో ఈ పాట ప్రారంభమవుతుంది.
ప్రభాకరన్ ఈ మెలోడీ కి స్వరాలు సమకూర్చగా.. మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తనదైన వాయిస్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. ఇక మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చేయగా, కమల్ ఖన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట తో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు.