హీరోయిన్ రాధిక ఆప్టే అంటే బాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే ఎప్పుడు ఈమె పలు రకాల వివాదమైన కామెంట్లు చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక బోల్డ్ పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా బోల్డ్ ఫోటోలతోనే మాటలతోనే మంచి క్రేజీ సంపాదించింది. దాదాపుగా అన్ని భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది రాధిక ఆప్టే.
టాలీవుడ్ లో నటించింది కొన్ని సినిమాలు అయినప్పటికీ బాగానే పేరు సంపాదించింది తాజాగా రాధిక ఆప్టే లండన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోని ఈమె సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. ఈ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి కూడా తెలియజేయడం జరిగింది రాధిక ఆప్టే. తనకు సౌత్ ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం ఎదురైందని ఒక స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ తనని చాలా దారుణంగా ప్రవర్తించారట.
అయితే సీన్ వివరించే క్రమంలో తన పక్క చైర్ లో కూర్చుని కావాలని తన పైన చేతులు వేయడం తన తైస్ మీద చేతులు వేయడం వంటివి చేస్తూ ఉండడంతో విసిగిపోయి కోపం ఆపుకోలేక అతని చెంప చెల్లుమనిపించానని తెలియజేస్తోంది రాధిక ఆప్టే. తాజాగా ఈ విషయం లండన్ మీడియాలో తెలియజేయడం జరిగింది దీంతో సెట్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని తెలియజేసింది.
ఈ విషయాన్ని అక్కడ ఉన్న డైరెక్టర్ కి చెప్పగా ఆ రోజు నుంచి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ అని ఆమె వద్దకు పంపించలేదని తెలియజేసింది రాధిక ఆప్టే. తరచూ ఈ మధ్య బోల్డ్ కామెంట్లు వంటివి చేయడం వల్ల మంచి పాపులారిటీ సంపాదించింది. రాధిక ఆప్టే అభిమానులు మాత్రం తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు.