రాధే శ్యామ్ నుంచి మరో అదిరిపోయే గ్లింప్..ఎప్పుడంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతోన్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాకు సంబంధించి పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.. ఇక వీటిని చూసిన ప్రేక్షకులు ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఫుల్ ఎమోషనల్.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచుకోవడంతో ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం..

ఇకపోతే ఈ సినిమా నుంచి ఒక పాట డిసెంబర్ 16వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పాటకు సంబంధించిన టీజర్ ను విడుదల చేస్తూ అధికారికంగా వెల్లడించడం గమనార్హం.. సంచారి..స్వప్న దూరమే అంటూ సాగే ఈ పాట టీజర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇక ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు గా సినీ ఇండస్ట్రీలో వినికిడి. స్వయంగా ఈ సినిమా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ పాట డిసెంబర్ 16వ తేదీన రాబోతోంది అంటూ ఒక టీజర్ ను షేర్ చేస్తూ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది..

Share.