రాధే శ్యామ్ నుంచి బిగ్ అప్డేట్..ఒక గుండె..రెండు గుండె చప్పుల్లు.. గ్లింప్స్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిన, టైటానిక్ సినిమా రేంజ్ లో ఒక ప్రేమకథ పండించడానికి సిద్ధంగా ఉన్నాడు రాధాకృష్ణ.. సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ. ఈ సినిమాకు సంబంధించిన పాటలు , టీజర్లు విడుదలయి ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు సరికొత్తగా ఒక గుండె.. రెండు గుండె చప్పుల్లు.. గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామంటూ ఒక అందమైన పోస్టర్ను విడుదల చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో కూడా డేట్ ను ఇవ్వడం జరిగింది. హిందీ వర్షన్ లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సాంగ్ రిలీజ్ చేస్తూ ఉండగా, తెలుగు, కన్నడ ,తమిళ్, మలయాళం భాషలలో రేపు రాత్రి ఏడు గంటలకు విడుదల చేస్తామని అన్నట్లుగా పోస్టర్లో ఇవ్వడం జరిగింది. పోస్టర్ చూస్తే ఎంతో రొమాంటిక్గా.. చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share.