Rachana..సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లే కాదు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ముఖ్యమే.. అంతేకాకుండా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ప్రాధాన్యతను తెచ్చుకున్న వారు ఉన్నారు. ఒకే ఒక్క సినిమాతోనేమంచి పాపులారిటీని సంపాదించుకున్న చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండి ఇప్పుడు హీరో ,హీరోయిన్లుగా కొనసాగించడం జరుగుతోంది.. ఇలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు పెద్దయిన తర్వాత వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.
ఎందుకంటే వారు పిల్లల గా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలను చూస్తే దిమ్మ తిరిగిపోయే అందంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తారు.. అయితే ఈ క్రమంలోనే మహేష్ బాబు వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఒక్క డైలాగుతో ఫేమస్ అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ రచన
ఆ సినిమాలో గోదావరి యసలో ఏంటి కూలెక్కలేదావాటర్ అనే డైలాగు వేసిన చిన్నారి అందుకే అందరికీ గుర్తు ఉండనే ఉంటుంది.. ఇలా ఒక్క డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం ఏం చేస్తోంది. ఎక్కడ ఉంటుంది. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రచన ఈ సినిమా తర్వాత పెద్దగా సినిమాలలో నటించలేదు. 2019లో పెళ్లి చేసుకుని భర్తతో కలిసి సింగపూర్ లో సెటిల్ అయ్యింది. అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి పిల్లలకు సంబంధించిన వీడియోలను చేస్తూ ఉంటుంది. అయితే ఈమధ్య రచన ఫోటోలు చూసిన నేటిజన్స్ ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నారు. చైల్డ్ యాక్టర్ గా ఉన్న ఈమె ఇలా అయింది ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram