R R R చ‌ర‌ణ్‌ను ఎన్టీఆర్ డామినేట్ చేశాడా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో ఇప్పుడు అంద‌రి దృష్టి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపైనే ఉంది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. రాజ‌మౌళి సైలెంట్‌గా షూటింగ్ చేసుకుంటూ వెళ్ల‌డంతో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ రెండేసి సార్లు గాయాల‌కు గుర‌వ్వ‌డంతో అస‌లు సినిమా షూటింగ్ ఎంత వ‌ర‌కు జ‌రిగిందో ? ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికి అర్థం కాలేదు.

అయితే సినిమా యూనిట్ తాజాగా అదిరిపోయే షాక్ ఇచ్చింది. సినిమా లవర్స్ కి ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చి ఖుషీ చేశారు మేకర్స్. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు సినిమా షూటింగ్ మొదలైందని ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసామని తెలిపారు. బుధ‌వారం ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ పేరు కూడా ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. అస‌లు ఎన్టీఆర్ హీరోయిన్ పేరు ప్ర‌క‌టించ‌కుండానే రాజ‌మౌళి ఏకంగా 70 శాతం షూటింగ్ ఫినిష్ చేసేశాడు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌ను బ‌ట్టి చూస్తే ఎన్టీఆర్ పోషిస్తోన్న కొమ‌రం భీం క్యారెక్ట‌ర్‌లో మ‌నోడు విజృంభించి న‌టించాడ‌ని… ఆ పాత్ర‌లో జీవించేశాడ‌ని… రామ్‌చ‌ర‌ణ్‌ను డామినేట్ చేసి న‌టించాడ‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. వాస్త‌వానికి రాజ‌మౌళి చ‌రిత్ర‌లో కొమ‌రం భీం కంటే కూడా ఎక్కువ మందికి ప‌రిచ‌యం ఉన్న అల్లూరి సీతారామరాజు క్యారెక్ట‌ర్ చ‌ర‌ణ్‌కు ఇచ్చినా.. న‌టనా ప‌రంగా మాత్రం ఎన్టీఆరే బాగా చేశాడ‌ని టాక్‌. మ‌రి అస‌లు ఎవ‌రు ఎలా చేశార‌న్న‌ది సినిమా చూసే వ‌ర‌కు తెలియ‌దు.

Share.