బాహుబలి మూవీ తరువాత రాజమౌళి ఇప్పుడు నేషనల్ దర్శకుడే కాదు ఏకంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో 11 సినిమాలు తీసిన రాజమౌళికి అసలు ప్లాప్ అన్నదే తెలియదు. రాజమౌళి ఎలాంటి సంక్లిష్టమైన కథలను అయినా తీసుకుని హిట్ కొట్టడం వెనక ఆయన కథల ఎంపిక, క్రమశిక్షణ, ప్లానింగ్, పని పట్ల నిబద్ధత, తన టీంతో వర్క్ చేయించుకునే విధానం ఇలా చాలానే ఉన్నాయి.
అంత పర్‌ఫెక్షనిస్ట్ కాబట్టే రాజమౌళి పేరు ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. రాజమౌళి సినిమాల్లో స్క్రిప్ట్ దగ్గరి నుండి, షెడ్యూల్స్, చిత్రీకరణ, విడుదల తేది ప్రతి విషయంలో క్రిస్టల్ క్లియర్ గా స్పష్టత మైంటైన్ చేస్తారు. అయితే రాజమౌళి తాజా సినిమా R R R విషయంలో మాత్రం ఆయన అంచనాలు ముందు నుంచి తప్పుతున్నాయి. ఏ విషయంలోనూ క్లారిటీ ఉండడం లేదు.
పలుసార్లు షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడుతున్నాయి. ఇద్దరు హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు తరచూ గాయపడుతున్నారు. ఇక గాయాల బెడద తప్పిందనుకుంటే చరణ్ సైరా కోసం నెలన్నర పాటు బిజీగా ఉండడంతో షూటింగ్ మరింత లేట్ అయ్యింది. ఇక ఎన్టీఆర్‌కు ఆరేడు నెలలుగా సరైన హీరోయిన్‌ను సెట్ చేయడం లేదు.
ఇక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ముందుగా చెప్పినట్టు ఈ సినిమా వచ్చే యేడాది జూలై 30న రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఈ మూవీ 2021కి షిఫ్ట్ అయ్యిందట. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు గాని, కొద్దిరోజులుగా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక సినిమా తాను అనుకున్నంత వరకు వచ్చే వరకు రాజీపడని రాజమౌళి సినిమా లేట్ అయినా బెస్ట్ సినిమా ఇస్తాడనడంలో డౌట్ లేదు.