బాహుబలి వంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత రాజమౌళి చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలుగా నటిస్తోన్నారు. కాగా.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో శరవేగంగా జరుగుతోంది. అక్కడే ఎన్టీఆర్‌కు సంబంధించి కీలక ఎపిసోడ్ షూట్ చేయనున్నాడట రాజమౌళి.
ఈ షూటింగ్ కోసం మంగళవారం వైజాగ్ చేరుకున్న ఎన్టీఆర్‌కు ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ టీంకి.. అభిమానులు సాదర స్వాగతం పలికారు. అయితే మంగళవారమే ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ఎన్టీఆర్ పంచె కట్టి.. పైన తలపాగా పెట్టి.. గిరిజన నాయకుడు, గోండు జాతి వీరుడు కొమరం భీంను అచ్చు గుద్దినట్టు ఉన్నాడు.
రౌద్ర రసంతో ఎన్టీఆర్ ఎలా ఉంటాడో ? స్పష్టంగా తెలుస్తోంది. ఇక వీడియో లీకేజ్‌పై దర్శకుడు రాజమౌళితో సహా, హీరోలు ఇద్దరూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాము ఒకవైపు కోట్లు ఖర్చుపెట్టి ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని అందించాలని ఎంతో శ్రమించి సినిమాలు తీస్తుంటే, ఈ విధంగా చిన్న సెల్ ఫోన్ తో ఈ సీన్లు లీక్ చేసేస్తున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారట.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి లీక్స్ బయటపడుతున్నాయని… ఇకపైన షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు సెట్స్‌లో చాలా కఠినంగా ఉండాలని రాజమౌళి సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశాడట.