పుష్పక విమానం.. ఓటీటీ లో స్ట్రీమింగ్ డేట్.. ఎప్పుడంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం పుష్పక విమానం. ఇకభేరో ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ స్వయంగా నిర్మించిన ఈ సినిమాను చాలా అగ్రసివ్ గా ప్రమోట్ చేయడం జరిగింది. దాంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.అంతేకాదు ఇప్పటికే కమర్షియల్ గా మంచి సక్సెస్ అయిన పుష్పక విమానం సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఈసారి ఆహా వారు భారీ ఎత్తున ప్రమోట్ చేస్తూ పుష్పక విమానంను స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వారు డిసెంబర్ 10న స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవలే సినిమా వచ్చిన కారణంగా జనాల్లో ఇంకా ఆసక్తి ఉంది. పబ్లిసిటీ అగ్రసివ్ గా చేయడం వల్ల మంచి పబ్లిసిటీ దక్కింది. కనుక ఆహా లో కూడా ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడే అవకాశం ఉందంటున్నారు. అందుకే మరీ ఆలస్యం చేయకుండా ఈ సినిమాను మరో వారంలో స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు ఆహా సంస్థ వారు.

Share.