స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని పాన్ ఇండియన్ చిత్రంగా డిసెంబర్ 17వ తేదిన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే తగ్గేదే లే అన్నట్టుగా ఇప్పటికే ప్రమోషన్స్‌ని జోరుగా చేస్తున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కావడం జరిగింది. టైలర్ విషయానికొస్తే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఎక్కువగా అడవిలోనే నటించ్చాడని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ రష్మిక మధ్య లవ్ ట్రాక్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ ఆంటు బన్నీ చెప్పే డైలాగ్.. ఈ సినిమాకి హైలైట్ గా నిలువనుంది. పోలీసుల నుంచి అల్లు అర్జున్ ఎదుర్కొనే సన్నివేశాలను సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఈ ట్రైలర్ చూశాక అభిమానులు మరింతగా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించాడు.