పుష్ప ట్రైలర్ రిలీజ్.. మరి కొన్ని గంటలే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని పాన్‌ ఇండియన్ చిత్రంగా డిసెంబర్ 17వ తేదిన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే తగ్గేదే లే అన్నట్టుగా ఇప్పటికే ప్రమోషన్స్‌ని జోరుగా చేస్తున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మరొక GIF తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేమిటంటే ఈరోజు సాయంత్రం 6 :03 గంటలకు పుష్ప సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేస్తున్నామని అధికారికంగా సినిమా మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను బాగా అలరిస్తూ.. సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగో డిసెంబర్ 17వ తేదీ సినిమా రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ఆ GIF లో ఉండటం గమనార్హం.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ మరో కొద్ది గంటల్లో విడుదల కాబోతుండడం గమనార్హం.

Share.