పుష్ప ట్రైలర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అర్జీవీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో రూపొందించారు. ఈ సినిమా రెండు విభాగాలుగా తెరకెక్కించడం జరుగుతుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్.. అనే పేరుతో డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది ఈ చిత్ర బృందం. అయితే ఈ ట్రైలర్ చూసిన రాంగోపాల్ వర్మ కొన్ని విషయాలను తెలియజేశాడు. వాటి గురించి చూద్దాం.

ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ఆర్జీవి, అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి రియల్ స్టిక్ పాత్రలో నటించడానికి భయపడని సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అనే.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ వంటి వారు ఇలాంటి పాత్రలు చేయగలరని సవాల్ చేస్తున్నట్లుగా తన ట్విట్టర్ నుంచి పోస్ట్ విడుదల చేశాడు. ఇక పుష్ప సినిమాలో తెలిపినట్లుగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని సినిమాలోని డైలాగ్ రాసుకొచ్చాడు.. అయితే అల్లుఅర్జున్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.

Share.