పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ పై వివాదం ముదురుతోంది ఉన్నది. ఇటీవల కాలంలో ఈ సాంగ్ పై వస్తున్న విమర్శలపై దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారుతూనే ఉన్నాయి. పుష్ప ప్రమోషన్ లో భాగంగా ఐటెం సాంగును భక్తి గీతాలతో పోలీసు దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించడం జరిగింది.

దేవి శ్రీ ప్రసాద్.. చేసిన ఈ వ్యాఖ్యలతో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన్ను బయట తిరగనివ్వం అని వార్నింగ్ ఇచ్చారు. ఐటెం సాంగ్ లోని కొన్ని లిరిక్స్ ని దేవుడు శ్లోకాలతో పోల్చడాన్ని ఖండిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే చేసిన వాక్యాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా పుష్ప సినిమా ప్రమోషన్లలో.. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్ రెండు ఒకటేనని మాట్లాడినట్లు తెలుస్తోంది

Share.