అల్లు అర్జున్ హీరోగా.. డైరెక్టర్ సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కింది పుష్ప. ఈ సినిమా ఈ రోజున ఎట్టకేలకు భారీ స్థాయిలో విడుదల అయ్యింది. పెద్ద ఎత్తున సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది ఈ సినిమా ఇకపోతే.. ఈ చిత్రం రిలీజ్ ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అందుకే తమిళ్ ,మలయాళం, కన్నడ, హిందీ , తెలుగు భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఇక అనుకున్న డేట్ కి సినిమాను విడుదల చేయాలని ఎంత కష్టపడ్డా ఇప్పుడు మాత్రం ఒక భాషలో పుష్పా సినిమా వాయిదా అయినట్టు తెలుస్తోంది. అదే మలయాళంలో ఐకాన్ స్టార్ కి అక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది.. కానీ కొన్ని కారణాల చేత పుష్ప రిలీజ్ ఒకరోజు అక్కడ వాయిదా పడినట్టు సమాచారం. డిసెంబర్ 18వ తేదీన మలయాళం వెర్షన్ వారికి అందుబాటులో ఉంటుందట. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.