అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా తొలి భాగం డిసెంబర్ 17 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఇక ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్ ను చాలా వేగవంతం చేస్తోంది. ఈ వేడుకకు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల ముఖ్యఅతిథులను తీసుకువచ్చే విధంగా.. చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.
ఇంతకీ ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎవరంటే.. చిరంజీవి, ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ వేడుకల్లో మెరున్ ఉన్నట్లుగా సమాచారం. ఇక వీరందరిని స్వయంగా అల్లు అర్జున్ నే స్వయంగా పిలుస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. తాజాగా షాహిద్ కపూర్ జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి అల్లు అరవింద్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక అందుచేతనే కచ్చితంగా వస్తాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పుష్ప సినిమా.. పాన్ ఇండియా మూవీ కాబట్టి వీరందరినీ తెలిస్తే కాస్త ఇమేజ్ పెరుగుతుందని ఆలోచించినట్టుగా సమాచారం.