Puspa: అభిమానులను నిరాశ పరుస్తున్న చిత్ర బృందం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే సంక్రాంతి సినిమాల హడావిడి మొదలయ్యింది. నిన్నటి రోజున వీరనరసింహరెడ్డి రిలీజై తెగ సందడి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా పుష్ప-2 ఎప్పుడూ అభిమానుల ముందుకు వస్తోంది అన్న విషయం తెలియటం లేదు. అందుకని ఈ విషయంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు.అప్డేట్ ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో అభిమానులు హడావిడి చేస్తున్నారు.

Allu Arjun's Pushpa 2 movie is scheduled to arrive in theatres in 2024 –  Entrepenuer Stories

ఒకవైపు పుష్ప-2 షూటింగ్ జరుగుతుందో లేదో కూడా ఫాన్స్ కి తెలియటం లేదు. గతేడాది విడుదలైన అవతార్ 2 సినిమాతో పాటు పుష్ప2 టీజర్ వస్తుందని ఆశించిన బన్నీ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలిందనే చెప్పాలి. పుష్ప2 టీం నుంచి సంక్రాంతికి అప్డేట్ ఉందని టాక్ వినిపిస్తుండటంతో ఫాన్స్ మళ్లీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి పుష్ప-2 సినిమా గురించి అప్డేట్ రాకపోవడంతో కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

దీంతో అప్డేట్ కావాలని అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ట్విట్టర్లో పోస్ట్లను షేర్ చేస్తున్నారు. చెప్పాలంటే మైత్రి సంస్ధ చాలా బిజీగా ఉంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి,బాలకృష్ణ సినిమాలను నిర్మించింది ఇదే సమస్త కాబట్టి దీంతో రిలీజ్లు డిస్ట్రిబ్యూషన్స్ ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు మైత్రి నిర్మాతలందరూ. కాబట్టి ఈ సమయంలో అల్లు అర్జున్ సినిమా అప్డేట్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ అప్డేట్ ఇయ్యకుండా ఉంటే తన ఫాన్స్ కచ్చితంగా సీరియస్ అవ్వటం గ్యారెంటీ.. మరి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలిమరి .పుష్ప మొదటి భాగంలో కూడా పలు విమర్శలు వినిపించాయి అందుచేతనే ఈసారి పుష్ప -2 లో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు చిత్రబృందం.

Share.