అల్లు అర్జున్ హీరోగా,రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని రెండు విభాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని డిసెంబర్ 17వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోలు, పాటలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుండి”ఏమ్ బిడ్డా నా అడ్డా “అంటూ వచ్చిన లిరికల్ వీడియో బాగా పాపులర్ అయింది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది.ఈ పాట పై హీరోయిన్ రష్మిక కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ పాటకు సంబంధించిన ఎడిట్ ను నేను చూసా, మైండ్ బ్లోయింగ్ గా ఉందిఅంటూ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ ప్రతి సినిమాలో ఏదో ఒక సరికొత్త పాటతో వస్తూ ఉంటాడు.. అలాగే ఈ పాటను థియేటర్లో చూసేటప్పుడు మైండ్ పోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే అంటూ పాట పై మరింత ఆసక్తి ని ప్రేమించింది రష్మిక.
🔥🔥🔥🔥🔥 https://t.co/paiRPTwWGk
— Rashmika Mandanna (@iamRashmika) November 19, 2021