ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పుష్ప. ఈ సినిమా పార్ట్ వన్ డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి పాటలు, ట్రైలర్ , టీజర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలో ఐటం సాంగులో చివర్లో బన్నీతో సమంత స్టెప్ లేయబోతోంది అని తెలిసిన ప్రతి ఒక్కరూ సమంత ఐటమ్ సాంగ్ లో ఎలా నటిస్తుందో అని తెలుసుకోవడానికి ఎదురుచూశారు. ఇక మొన్నామధ్య సమంత కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా డిసెంబర్ 10వ తేదీన అందరికీ శుభవార్త చెబుతున్నా అని చెప్పింది..
అది ఏదో కాదు పుష్పా సినిమా నుంచి తాను నటించిన ఐటమ్ సాంగ్ ఇప్పుడు తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే పుష్ప సినిమా నుంచి ఐటమ్ సాంగ్ అయినా ఊ అంటావా ..? ఊ ఊ అంటావా..? అనే సాంగ్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఎప్పుడూ ఐటమ్ సాంగ్ ల పైన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే దేవిశ్రీప్రసాద్ ఈ డిఫరెంట్ ట్యూన్ తో వచ్చారు.. తెలుగులో ఈ పాటను చంద్రబోస్ లిరిక్స్ రాయగా ఇంద్రవతి చౌహాన్ గానాలాపన చేశారు. ఇకపోతే తమిళ్ లో ఈ పాటను సింగర్ అలాగే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా ఆలపించారు. కన్నడలో తెలుగు అమ్మాయి మంగ్లీ పాడగా, మలయాళంలో రమ్య నంబీశన్ పాడారు. ఇలా ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరి చేత దేవిశ్రీప్రసాద్ ఈ పాటను పాడించడం గమనార్హం.