పుష్ప సినిమా ఐటెం సాంగ్ కోసం తన కష్టాన్ని తెలిపిన సమంత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ సమంత ఒక ఐటెం సాంగ్ లో నటించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మత్తు వాయిస్ తో ఉ అంటావా మామ.. ఊ ఊ అంటావా సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా అలరించింది అని చెప్పవచ్చు. థియేటర్ లో కూడా ఈ పాటకి క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

ఇక సింగర్ ఇంద్రావతి చౌహన్ ఈ పాటను పాడింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సంగీతం అందించారు. ఇక తమన్నా నటన ఇంస్టాగ్రామ్ వేదికగా”నేను బాగా చేశాను.. నేను చెడుగా చేశాను.. నేను ఫన్నీ గా ఉన్నాను, నేను సీరియస్ గా ఉన్నాను, నేను చాట్ షో హోస్ట్ ని కూడా.. నేను తీసుకునే ప్రతి దానిలో రాణించడానికి నేను చాలా కష్టపడుతున్నాను.. కానీ సెక్సీ గా ఉండటం నెక్స్ట్ లెవెల్ లో హార్డ్ వర్క్”అంటూ పోస్ట్ చేసింది. అటు ఇంటర్వ్యూలో ఇదే పాట పై స్పందిస్తూ.. ఈ పాటలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది సమంత.

Share.