స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ వీరందరి కాంబినేషన్లో వస్తున్న సినిమా పుష్ప . ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. పుష్ప సినిమాకు సంబంధించి హోటల్ బిజినెస్ మార్క్ ఇప్పుడు బయటికి వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి తో హక్కుల కలిపి 250 కోట్ల బిజినెస్ జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం.
అలా వైకుంఠపురం సినిమా తో భారీ నీ హిట్ అందుకున్న తర్వాత అల్లు అర్జున్ కి ఇది అతి పెద్ద బిజినెస్ అని చెప్పవచ్చు. అలాగే దీన్ని బట్టి సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సమంత కూడా ఒక స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రెండు విభాగాలుగా నిర్మిస్తున్నారు