‘పుష్ప’రాజ్‌కి పోలీసుల సూటి ప్రశ్న.. అసలు మ్యాటర్ ఏమిటంటే…?

Google+ Pinterest LinkedIn Tumblr +

సోషల్‌ మీడియాను ఎవరికీ నచ్చినట్లు వాళ్లు వాడేసుకుంటున్నారు అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అందరి వాడకం ఎలా ఉన్నాగాని సైబరాబాద్‌ పోలీసులు మాత్రం తమకు అనుగుణంగా సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు..ఎన్నో మంచి మంచి అంశాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలియచేస్తూన్నారు. ముఖ్యంగా టాప్‌ హీరోల సినిమాలోని ఫేమస్ అయిన డైలాగ్స్‌ని తమకు అనుగుణంగా మార్చుకొని ట్రాఫిక్‌ నియమాలపై జనాల్లో అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన పుష్ప సినిమాలోని ఒక డైలాగ్ ను కూడా సైబరాబాద్ పోలీసులు వారికి అనుకూలంగా మార్చుకున్నారు. ఈ చిత్రంలోని బుల్లెట్‌ బండిపై స్టైలిష్‌గా కూర్చున్న అల్లు అర్జున్ ఫోటోను సైబరాబాద్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ పుష్ప సినిమాలో విలన్‌ చెప్పిన డైలాగ్ ను మార్చి “హెల్మెట్ – మిర్రర్స్ లేవా పుష్ప?’ అంటూ ఒక మీమ్ ను క్రియేట్ చేసి ట్వీట్ చేశారు.అలాగే ఈ ఫోటోతో పాటు ప్రతి ఒక్కరు ‘హెల్మెట్ ధరించండి, రేర్ వ్యూ మిర్రర్ లను బైక్ లకు ఫిక్స్ చేయండి, సురక్షితముగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

Share.