ప్రస్తుతం తెలుగు సినిమాలు కేవలం పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా ప్రపంచంలో వివిధ దేశాలలో విడుదల చేస్తూ భారీ వసూలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప సినిమాని కూడా డిసెంబర్ 8న రష్యాలో విడుదల చేశారు. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన పుష్ప సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోని ఈ సినిమాను ఇప్పుడు రష్యాలో కూడా విడుదల చేసి లాభాల బాట పట్టారు నిర్మాతలు.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రష్యా లో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమా విడుదల కోసం ప్రమోషన్స్ లో భాగంగా రష్యా చేరుకున్న చిత్ర బృందం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే భారీ ఎత్తున ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే అంతకుమించి లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఏ సినిమాలో నటిస్తారో ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని తాతకు తగ్గ మనవడిగా చలామణి అవుతున్నారు అల్లు అర్జున్. ఇంకా ఎలాగో పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయింది కాబట్టి.. ఇది కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.