అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నటి కల్పలత?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందననటనకు గాను పలువురు వారి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగుతో పాటు మిగిలిన ఇండస్ట్రీలో కూడా పుష్ప సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర బృందం సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ నటించిన విషయం తెలిసిందే. ఇందులో పుష్ప రాజ్ కు తల్లిగా నటించిన కల్పలత ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్ షూటింగ్ కు వచ్చిన తర్వాత తన వ్యక్తిగత పక్కన బెట్టి షూటింగ్లో మునిగిపోతాడు అని, తన పాత్ర గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అని ఆమె తెలిపింది. అనంతరం ఆమె వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఆమెకు ఇద్దరు పిల్లలని వాళ్ళు యూఎస్ఏ లో ఉంటారని తెలిపింది. అయితే నాకు ఎప్పుడూ మగ పిల్లలు లేరు అని బాధ పడలేదు. కానీ బన్నీతో సినిమా షూటింగ్ ఆయన తర్వాత చాలా బాధపడ్డాను. అల్లు అర్జున్ నాకు సపోర్ట్ గా నిలుస్తూ నేను ఉన్నాను అంటూ కళ్ళతోనే భీమా ఇవ్వడం చూసి ఎమోషనల్ అయ్యాను అని ఆమె తెలిపింది. కొడుకు ఉంటే ఇంత బాగా చూసుకునే వాడు ఏమో అని అనిపించింది.పుష్ప రాజ్ లాంటి కొడుకు ఉంటే మరింత బాగుండేది అనిపించింది అని ఆమె చెప్పుకొచ్చింది.

Share.