టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. స్టార్ హీరోలందరీ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరుపొందింది.అలా స్టార్డం ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. దీంతో సమంత కాస్త డిస్టర్బ్ అయిందని చెప్పవచ్చు. విడాకులు ఇచ్చిన తర్వాత సమంత గతంలో కంటే మరింత గ్లామర్‌ను వలకబోస్తూ ఉంటోంది.
అలా పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగులో కూడా నటించింది. ఈ చిత్రంలో హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్ గా రస్మిక నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లేవలో విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. అయితే ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది ఈ పాట తర్వాత సమంతకు మరికొన్ని అవకాశాలు వచ్చాయి.. పాన్ ఇండియా లేవలో ఆకట్టుకోవడంతో సమంతకు బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే వరుస ఆఫర్లు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమెకు మయో సైటీస్ అనే వ్యాధి బారిన పడడం జరిగింది.
దీని నుండి కోలుకోవడానికి సమంత చాలా సమయం పట్టింది. దీంతో సమంత షూటింగ్లో పాల్గొనడానికి ప్రస్తుతం సిద్ధమవుతోందని తెలుస్తోంది. నిన్నటి రోజున ఒక టెంపుల్ లో ముక్కు చెల్లించుకుంటున్నట్లు కొన్ని ఫోటోలు వీడియోలు కూడా బయటపడడం జరిగింది. ఇక తాను నటించబోతున్న వెబ్ సిరీస్ ,సినిమాలను పూర్తి చేయాలని పనిలో పడింది. ఇదంతా ఇలా ఉండగా సమంత సుకుమార్ కు మరొక అవకాశం ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప-2 లో ఈసారి సమంత కోసం ప్రత్యేకమైన పాట ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సమంత మాత్రం అందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. అందుకు కారణం ఇక సమంత సినిమాలు మర్చిపోయి కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారని భయంతో ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.