పుష్ప సినిమా నుంచి బిగ్ అప్డేట్: ట్రైలర్ డేట్ ఫిక్స్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వల్లి గా రష్మిక నటిస్తోంది. ఇక ఈ సినిమాలో నటించే వారంతా డి గ్లామరస్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి విడుదలైన ఫోటోలు, వీడియోలు, పాటలు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల ఈ విషయాన్ని తెలియజేసింది. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.దీంతో ఈ సినిమా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా మలయాళ నటుడు ఫాహాద్ ఫజిల్ , విలన్ గా సునీల్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప సినిమాకు సంబంధించి త్వరత్వరగా అప్ డేట్ రావడం విశేషం.

Share.