టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ దాదాపు చాలాకాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ అయ్యారు. మాస్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గత కొన్నాళ్ల క్రితం కంటిన్యూగా పూరీ మ్యూజింగ్స్ లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన పూరీ ఇటీవల సైలెంట్ అయిపోయారు. దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నెట్టింట యాక్టివ్ అవ్వడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా పూరీ మ్యూజింగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ విరక్తి, వైరాగ్యం, ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడం గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.
తిరుగుబోతులు, తాగుబోతులు, ఆశ బోతులు, పొగరుబోతులు అందరూ కలిసేది ఒకే ఒక్క జంక్షన్.. అదే విరక్తి.. అని అంటూ సంచలన కామెంట్లు చేశారు.. ఎవరినో ప్రేమిస్తామో.. వాళ్ళు మోసం చేస్తారు.. వెక్కివెక్కి ఏడుస్తాము.. రాత్రి పగలు తేడా లేకుండా ఏడుస్తాము.. మీరు గాని అలా ఏడుస్తుంటే కంగ్రాట్స్.. మీరు క్యూలో ఉన్నారు.. రాత్రి పగలు కునుకు లేకుండా ఎలాగైనా డబ్బు సంపాదించాలని కష్టపడుతున్నారు.. కుటుంబం పరువు కాపాడాలి ..కోట్లు సంపాదించాలి.. మీరు ఇలా ఉంటే వెరీ గుడ్డు.
మీరు చేయని మోసం లేదు.. ఎలాగైనా పదవి కావాలి.. అందుకోసం ఎంతమందినైనా నరుకుతా అనుకుంటే మీరు సరైన దారిలో పయనిస్తున్నారని అర్థం.. ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నారని అర్థం.. ఎంత కామస్తారో కామించండి.. ఎంత తాగుతారో తాగండి.. మద్యం మీద విరక్తి కలిగేలా తాగండి.. అప్పుడు మీరే సరైన దారిలోకి వస్తారు. వయసు పెరిగే కొద్దీ కొన్ని అర్థమవుతాయి.. నరాల బలహీనతమైన తర్వాత కూలవడ్డాక అర్థమవుతాయి. ఎలాంటి వారైనా సరే ఏ పని చేసినా సరే చివరికి విరక్తి పొందుతారు. ఆ తర్వాత వచ్చేది వైరాగ్యం.. ఎందుకు ఇలాంటి పిల్లలను కన్నామని ఒక తండ్రి ఏడుస్తుంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారని చెప్పండి. మనమందరం ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేందుకే పుట్టాము.. కొంచెం త్వరగా అడుగులు వేద్దాం పదండి అంటూ చెప్పుకొచ్చారు పూరీ.