క్రేజీ హీరోతో పోకిరి డైరెక్టర్.. బాబోయ్ అంటున్న ఫ్యాన్స్!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో విజయ్ దెవరకొండ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో యూత్‌లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా ఈ హీరో మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ హీరో నటించబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. స్టార్ హీరోల దగ్గర్నుండి చిన్న హీరోల వరకు అందరికీ మాస్ స్టైల్‌ను పరిచయం చేసిన దర్శకుడు పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. పోకిరి వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందించి మహేష్ బాబును కూడా మాస్ హీరోగా చూపించిన క్రెడిట్ పూరీది. ఇప్పుడు అర్జున్ రెడ్డి హీరోకు మరింత మాస్ ఫాలోయింగ్ పెంచేందుకు పూరీ రెడీ అవుతున్నాడు. దీని కోసం విజయ్‌కు సరిపోయే కథను ఒకటి తయారు చేస్తున్నాడట ఈ డైరెక్టర్.

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పూరీ-విజయ్ దేవరకొండ సినిమాను ప్రేక్షకులు చూడొచ్చు. అయితే ఈ విషయంపై అటు డైరెక్టర్ గానీ, హీరో గానీ ఎలాంటి క్లూ ఇవ్వలేదు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Share.