దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం తో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మూగబోయింది.
ఇప్పటికీ ఆయన మరణ వార్తను అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, దానధర్మాలు చేసిన వ్యక్తి ఇలా అకస్మాత్తుగా చనిపోవడం అనేది సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో కి నెట్టేసినట్లు అయింది.
ఇదిలా ఉంటే పునీత్ మరణించడానికి ముందు తన పూర్వీకులు తన తండ్రి సూపర్ స్టార్ రాజ్ కుమార్ స్వస్థలమైన గాజునూర్ లోని ఇంటిని మ్యూజియం గా మార్చాలి అని అనుకున్నాడట. శిధిలావస్థకు చేరుకున్న ఆ ఇంటిని అందంగా మర్చి ఒక మ్యూజియం గా మార్చాలని అనుకున్నాడట.
కానీ దురదృష్టవశాత్తు పునీత్ రాజ్ కుమార్ కల నెరవేరకుండానే మరణించాడు. అయితే పునీత్ కలను నెరవేర్చడానికి అతని మేనల్లుడు గోపాల్ రంగంలోకి దిగాడు. ఆ ఇంటిని మ్యూజియంగా మార్చి ఎందుకు శరవేగంగా పనులు ప్రారంభించారు. మరో రెండు నెలల్లో ఆ ఇంటికి సంబంధించిన పనులు పూర్తవుతాయని తెలిపారు.