కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అకాల మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. పునీత్ చనిపోయారు అన్న వార్తను ఇప్పటికే అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే పునీత్ చనిపోయి నెల రోజులు అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పునీత్ సమాధి వద్ద పూజలు నిర్వహించారు. పునీత్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.
ఇప్పటికీ పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకాలు కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 1 నాటికి పునీత్ రాజ్ కుమార్ పెళ్లి అయ్యి 22 ఏళ్లు పూర్తి అయ్యింది. 1999 డిసెంబరు 1న పునీత్ అశ్విని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నట్టుగా ఈసారి వివాహ వార్షికోత్సవానికి అతను లేరు. తమ 22 వ వివాహ వార్షికోత్సవం రోజున పునీత్ లేరు అని అతని భార్య ఎమోషనల్ అయ్యింది.ఇక టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ తాజాగా బెంగళూరులోని పునీత్ కుటుంబాన్ని పరామర్శించి, అనంతరం తనకు పునీత్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.