సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్య మీనన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు , టీజర్లు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ అయితే ఏకంగా యూట్యూబ్ లో కొన్ని మిలియన్ వ్యూస్ నమోదు చేసుకోవడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయము, పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపడమే కాకుండా బాగా ఆసక్తిని కూడా పెంచుతున్నాయి.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ప్రముఖ నిర్మాత అలాగే నటుడు బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ అబ్బ అబ్బ అబ్బబ్బా బ్బ్బా అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇవ్వడం గమనార్హం.. ఈ పోస్టర్ లో వేటాడడానికి సిద్ధంగా ఉన్న పులి తో పాటు పవన్ కళ్యాణ్ ముఖాన్ని కూడా జోడించడం చాలా గొప్పగా ఉండడంతో పాటు ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బాభాబాబాబాబాబాబాబా🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅@PawanKalyan pic.twitter.com/LOZ45FMUXo
— BANDLA GANESH. (@ganeshbandla) November 30, 2021