టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ కెరియర్ లో ఇప్పటివరకు 30కు పైగా సినిమాలు చేశారు. అలాంటి పవన్ సినిమా డేట్లు ఇచ్చిన సినిమా చేసేందుకు నిర్మాతలు సైతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.ముఖ్యంగా ఫలితం ఎలా ఉన్నప్పటికీ నష్టాలు రాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
2024 ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈసారి ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని పట్టుబట్టి తన పార్టీ హవా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలు కన్నా ఎక్కువగా రాజకీయాల మీదే ధ్యాసపెట్టినట్లు కనిపిస్తోంది. అలా సినిమాలు వదిలేసారా అంటే అదేమీ లేదు ఒకవైపు సినిమాలు చేసేందుకు అంగీకరిస్తూ అడ్వాన్సులు తీసుకుంటూ ఉంటున్నారు. ఇలా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇవ్వడం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఇంకా ఇప్పటికి పూర్తి కావడం లేదు. ఇప్పటికే ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పవన్ వల్ల ఆలస్యం అవుతూ ఉంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఐదు సినిమాలకు పవన్ కళ్యాణ్ అడ్వాన్సులు తీసుకొని ఇంకా ఈ సినిమాలను మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో పలువురు నెటిజెన్లకు కూడా కేవలం పవన్ కళ్యాణ్ డబ్బు కోసం మాత్రమే సినిమాలు ఒప్పుకుంటున్నారని అసహ్యించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొంతమంది నిర్మాతలు కూడా పవన్తో సినిమా ఒప్పుకొని ఇబ్బందులు పడవలసి వస్తోంది అంటూ పలువురు సినీ ప్రముఖులు కామెంట్లు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.