అంతకు మించి పై కేసు నమోదు చేసిన నిర్మాత

Google+ Pinterest LinkedIn Tumblr +

రష్మీ గౌతమ్, జై జంటగా నటించిన రొమాంటిక్, థ్రిల్లర్ ‘ అంతకు మించి ‘ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలై ఒక్క రోజైన కాకముందే అనేక వివాదాలు ఈ సినిమాని వెంటాడుతున్నాయి. ‘ అంతకు మించి ‘ సినిమా పై నిర్మాత గౌరీ శంకర్ ప్రసాద్ కోర్ట్ లో కేసు నమోదు చేసారు. తనకి రావలసిన డబ్బు ఇవ్వకుండా సినిమాని విడుదల చేసారని..ముందుగా ఈ సినిమాకి నిర్మాతగా పని చేసిన గౌరీ శంకర్ ప్రసాద్ ఆర్ధిక ఇబ్బందుల వలన మధ్యలో సినిమా ఆపేసారు. అయితే అటు తర్వాత సతీష్‌ జై తానే హీరోగా, నిర్మాతగా సినిమాని పూర్తిచేసేందుకు ముందుకొచ్చాడట.

షూటింగ్ కోసం ఇప్పటి వరకు నేను రూ 50 లక్షలు ఖర్చు చేసానని, తనకి ఆ డబ్బు ఇవ్వాలని గౌరీ శంకర్ అడిగారట..దానికి ఒప్పుకున్నా జై సినిమా విడుదల అయ్యేలోపు ఇస్తానని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదని చెప్పారు. అయితే తాను మొన్న కూడా వెళ్లి డబ్బులు ఇవ్వమని అడిగిన పట్టించుకోలేదని, కావున రంగ రెడ్డి కోర్ట్ లో కేసు నమోదు చేసానని. కోర్ట్ సినిమా విడుదల ఆపివేయాలని తీర్పు ఇవ్వగా.. కోర్ట్ తీర్పు కూడా ధిక్కరించి సినిమా విడుదల చేసారని తనని కూడా మోసం చేసినందుకు ఆవేదనతో గౌరీ శంకర్ బంజారా హిల్స్ పొలిసు స్టేషన్ లో కేసు నమోదు చేసారు.

Share.